టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆనం

టీడీపీ పార్టీ లో చేరబోతున్నట్లు వైస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారిక ప్రకటన చేసారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. శుక్రవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలిపారు. అన్ని విషయాలు చర్చించామని , లోకేష్ పాదయాత్రపై కూడా మాట్లాడుకున్నామని వివరించారు.

ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ అధినేత చెప్పిన సందేశాన్ని వారికి వినిపించారు. దీనిపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. అనంతరం టీడీపీలో చేరుతున్నట్టు అనం ప్రకటించారు. మరో ఇద్దరు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతారని ఆ పార్టీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. వైస్సార్సీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపే మార్పు నెల్లూరులోనే మొదలైంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.