గ్రాండ్ గా బాలకృష్ణ 109 మూవీ ఓపెనింగ్

నందమూరి బాలకృష్ణ 109 మూవీ ఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108 వ చిత్రం భగవంత్ కేసరి మూవీ తెరకెక్కుతుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.