జగన్ కీలక నిర్ణయం : మంత్రివర్గంతో పాటు పార్టీ రీజినల్ కమిటీ ఏర్పటు..?

cm jagan

ఏపీలో రేపు (ఏప్రిల్ 11) ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేవలం మంత్రి వర్గమే కాకుండా పార్టీ రీజినల్ కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 24 మంది మంత్రులు రాజీనామా చేయగా…ఆ రాజీనామా పత్రాలను గవర్నర్ కు అందజేయడం జరిగింది. 10 మంది మంత్రులకు కొనసాగింపుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా 15 మందికి క్యాబినెట్ లో చోటు దక్కనుంది.

అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం. సామాజికి సమీకరణాలు, సమర్థత, జిల్లాల అవసరాలను పరినణలోకి తీసుకుని మంత్రి వర్గం కూర్పు ఉండనుందని , ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలు, ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్ లో చోటు ఇవ్వబోతున్నట్లు సమాచారం.