కిరణ్ అబ్బవరం లుక్ మారింది

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లుక్ ను మార్చుకున్నాడు. రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరో వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇప్పటివరకు ఒకే లుక్ తో కనిపించిన కిరణ్..ఈ మూవీ లో మాత్రం కాస్త తన లుక్ ను చేంజ్ చేసాడు. తొలిసారి తన లుక్స్ తో మెస్మరైజ్ చేశాడు. స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చివరగా కిరణ్ మీటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో పోలీసు అధికారిగా కనిపించాడు.