కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్

CM KCR paid tribute to Krishna’s body

Community-verified icon


నానక్ రామగూడ లో కృష్ణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు నివాళ్లు అర్పించారు. మహేష్ బాబు తో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారికి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యురాలకు ధైర్యం చెప్పారు. అలాగే కేటీఆర్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగచైతన్య, కీరవాణి, బోయపాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవి , పవన్ కళ్యాణ్, వెంకటేష్ , సాయి కుమార్ తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించడం జరిగింది. ఈరోజు సాయంత్రం గచ్చిబౌలి లోని స్టేడియం లో అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాని ఉంచనున్నారు. రేపు ఉదయం మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపనున్నారు.

ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య కృష్ణ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గరి నుండి కూడా ఆయన్ను వెంటిలేటర్ ఫై ఉంచి చికిత్స అందజేశారు. కాంటినెంటల్ టాప్ డైరెక్టర్స్ అంత కూడా ఆయనకు చికిత్స అందించినప్పటికీ , ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. కృష్ణ ఇకలేరు అనే వార్త యావత్ సినీ పరిశ్రమ తట్టుకోలేకపోయింది. కడసారి ఆయన్ను చూసేందుకు సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు తరలివస్తున్నారు.