ప్రతి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ – ముకేశ్ కుమార్ మీనా

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లకు ముకేశ్ కుమార్ మీనా సూచించారు. RO టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే ఏజెంట్ కు అవకాశం కల్పించాలన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ కు సంబదించిన లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అనే ఉత్కఠకు రేపటితో తెరపడనుంది.

ముఖ్యంగా ఏపీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి గా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కూటమి గెలుస్తుందని తెలిపినప్పటికీ , లోకల్ సర్వేలు మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం అభ్యర్థికి కల్పించాలని కలెక్టర్లకు ముకేశ్ కుమార్ మీనా సూచించారు. RO టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడే ఏజెంట్కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫాం-17C, పెన్ను/ పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి సెల్ఫోన్ కలిగిన మీడియా ప్రతినిధులను అనుమతించవద్దని సూచించారు.