ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

heavy-rains-lashes-tamil-nadu-districts

ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొంత కాలంగా ఎండలతో వేడేక్కిన ఏపీ.. తాజాగా నైరుతి ఆగమనంతో కూల్ అయిపోయింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోని పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది.

నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని గంటల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతాయని అలర్ట్ చేసింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, భారీ వర్షాలు కురిసే వేళ ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని కీలక సూచన చేసింది. అత్యవసరమైతే తప్ప వర్షాలు పడే సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.