తెలంగాణ లో బడిబాట వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పట్నుంచి తిరిగి ప్రారంభిస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. బడి మానేసిన, బడిలో చేరని పిల్లను గుర్తించి వారిని స్కూళ్లలో చేర్చేందుకు ఈ నెల 19 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 10 నుంచి 25వరకు నిర్వహించే అవకాశాలున్నాయి.