తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిన కాంగ్రెస్ – అమిత్ షా

తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి ATM గా మార్చేశారని.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. సిద్ధిపేటలో బీజేపీ విశాఖ జనసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..దేశం వ్యాప్తంగా ఉన్న జఠిలమైన సమస్యలకు కూడా తన ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370ని రద్దు చేశామని అన్నారు. సాధ్యం కాని హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్న ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు.

అదేవిధంగా తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫండ్ అంతా తెలంగాణ నుంచి వెళ్తోందని ఆరోపించారు. మరోసారి మోడీ ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి అనేది లేకుండా చేస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగనే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తామని అన్నారు. అందుకోసం రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని.. అందుకే నిర్మాణం చేయకుండా కేసులు వేసిందన్నారు. మోడీ కేసులు గెలిచి మందిర నిర్మాణం చేసి బలరాముడి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి 70 ఏళ్ల సమస్యను పరిష్కరించారని తెలిపారు.