మరోసారి భీష్మ కాంబో ..?

నితిన్ – వెంకీ కుడుముల కలయికలో వచ్చిన భీష్మ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు..అలాంటిది కాంబో మరోసారి సెట్స్పైకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యముగా భీష్మ మూవీ లో మ్యూజిక్ , నితిన్‌ కామెడీ టైమింగ్‌, పర్‌ఫార్మెన్స్‌, రష్మిక – నితిన్ ల లవ్ ట్రాక్ , రొమాన్స్ ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఫిదా చేసాయి. ఇక వెంకీ టేకింగ్, పంచ్‌ డైలాగ్స్ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌చేశాయి. దాంతో మరోసారి వీరి కాంబో అనగానే అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.

వెంకీ కుడుముల భీష్మ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే భీష్మ తర్వాత వెంకీ, చిరుతో సినిమా చేయాల్సిఉంది. కానీ చిరుకు ఫైనల్‌ నేరేషన్‌ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ కాన్సిల్‌ అయింది. ఈ క్రమంలో వెంకీ కుడుముల, నితిన్‌కు మరో కథను వినిపించాడట. నితిన్‌కు కూడా కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీని మైత్రీ సంస్థ నిర్మించనుంది.