దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడు నాయకుడా..? – బాలయ్య

balakrishna-press-meet-on-chandrababu-arrest

ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ దూకుడు కనపరుస్తున్నాడు. కూటమి విజయం కోసం తనవంతు కృషి చేస్తున్నాడు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా ధనాన్ని వైసిపి నాయకులు పందికొక్కుల్లా మెక్కారని మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 వేల కోట్ల సిద్ధం హోల్డింగ్ లు పెట్టుకున్నారని బాలయ్య నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కావాలా ప్రజల సంక్షేమ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత వేరే మార్గంలోకి వెళ్తున్నారని ఆరోపించారు. చిన్నవయసులోనే గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఎస్సీల మీద దాడులు అత్యాచారాలు ఎక్కువైపోయాయి అని అన్నారు బాలయ్య. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే రౌడీలు వైసీపీ లో ఉన్నారు..అలాంటి నాయకులూ కావాలా అన్నారు.