నియమ నిబంధనలు సామాన్యులకేనా?
కొండపోచమ్మ సాగర్..కెసిఆర్ కు, మంత్రులకు మాస్కుల్లేవు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కెసిఆర్ పై మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను ఎత్తిపోతలు చేసే కార్యక్రమంలో సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరైనా విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా కెసిఆర్,మంత్రులు వందలాది మంది మధ్య ఉండి కూడా ముఖాలకు మాస్కులు ధరించలేదని, కనీసం భౌతికదూరం పాటించలేదని విమర్శించారు. ‘స్వయంగా కెసిఆర్ కరోనా లాక్ డౌన్ రూల్స్ రూపొందించారు, పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువమంది పాల్గొనరాదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారు. నియమనిబంధనలు సామాన్యులకేనా…. కెసిఆర్ ఏమైనా చట్టానికి అతీతుడా?’ అంటూ ఉత్తమ్ ఆగ్రహాం వ్యక్తపరిచారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/