మరో యాత్రకు జగన్ సిద్ధం..

Seventh day Jagan memantha siddham yatra

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మరో యాత్రకు సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను పూర్తి చేసిన జగన్.. తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తుంది.

రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కోసభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని అంటున్నారు.