ఈరోజు తెలంగాణ లో అమిత్ షా బిజీ బిజీ

ఈరోజుతో తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని మైకులు బంద్ కాబోతున్నాయి. ఇక చివరి రోజు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తించబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు.

ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధీలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు.