నేడు తెలంగాణకు ప్రియాంకా గాంధీ

ఈరోజుతో ప్రచారానికి తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని మైకులు బంద్ కాబోతున్నాయి. ఇక చివరి రోజు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తించబోతున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు.

అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు. ప్రియాంకతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటించగా..ఈరోజు ప్రియాంక ఫైనల్ టచ్ ఇవ్వనుంది.