వ్యాక్సిన్ ధరలు ఇన్ని రకాలా ?

ప్రధాని మోడీకి సోనియా లేఖ

Sonia Gandhi
Sonia Gandhi

New Delhi : దేశంలో వ్యాక్సిన్ కు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ. 150 , రాష్ట్ర ప్రభుత్వానికి రూ 400 , ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 600 ధర నిర్ణయించటం ఏంటని ప్రశ్నించారు.
ఒకే కంపెనీ తయారు చేసే వ్యాక్సిన్‌పై ఇన్ని రకాల ధరలు ఎందుకని ప్రశ్నిస్తూ . ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీరమ్ నిర్ణయించిన ధరలతో సామాన్య పౌరులపైనా, రాష్ట్ర ప్రభుత్వాలపైనా భారం పడిందని. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరారు

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/