ఈరోజుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడనుంది

తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల హంగామా శుభం కార్డు కు వచ్చేసింది. దాదాపుగా రెండునెలలుగా ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతూ వచ్చింది. మరో 48 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ సాయంత్రంతో ప్రచారాన్ని అన్ని రాజకీయపక్షాలు ముగించాల్సి ఉంటుంది. హోరెత్తిన మైకులు ..సాయంత్రం 6 తర్వాత మూగబోనున్నాయి. ఇక చివరి రోజు అని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనీ చూస్తున్నాయి. చాల చోట్ల ఉదయం 6 నుండే ప్రచారం మొదలుపెట్టారు.

తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. ఈసారి గెలుపు మాదంటే మాదే అంటూ బిఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ పార్టీ లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అటు ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల జరగబోతున్నాయి. ఈసారి కూటమి గా జనసేన , బిజెపి , టిడిపి పార్టీలు ఏర్పడగా..వైసీపీ , కాంగ్రెస్ లు ఒంటరిగా బరిలోకిదిగాయి. ఈసారి మాదంటే మాదంటూ కూటమి , వైసీపీ పార్టీలు విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక చివరి రోజున ఈరోజు ఓటర్లను మరోసారి ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారు.