కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడి

Cabinet Briefing by Union Ministers Prakash Javadekar & Dr. Jitendra Singh

న్యూఢిల్లీ: ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. అనంతరం కేబీనెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన ‘మిషన్ కర్మయోగి’ కార్యాచరణకు కేబినెట్ సమ్మతి తెలిపినట్టు జవదేకర్ పేర్కొన్నారు. అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో 5 అధికార భాషలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కశ్మీరీ, ఉర్దూ, డోగ్రీ, హిందీ, ఇంగ్లీషు గుర్తింపు పొందనున్నాయి. వీటికి సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 3 కీలక ఎంవోయూలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జవదేకర్ వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/