జగన్‌ను ఎదుర్కునే శక్తి టీడీపీ-జనసేనకు లేదు – అంబటి

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దీంతో పార్టీల నేతల మధ్య వారు మరింత ముదురుతోంది.

తాజాగా వైసీపీ మంత్రి అంబటి ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ..చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లపై సెటైర్లు పేల్చారు. నాలుగు సిద్ధం సభలతో టీడీపీ-జనసేన నేతలు శ్రీమద్రమారమణ గోవిందా అంటున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు పోటీగా టీడీపీ-జనసేన సభలను నిర్వహించలేకపోతోందని , రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసారు. సీఎం జగన్‌ను ఎదుర్కునే శక్తి టీడీపీ-జనసేనకు లేదని అన్నారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామంటే కొందరు ఎగతాళి చేశారని, ఇప్పుడు అదే నెరవేరబోతుందని చెప్పారు.

నిన్నటివరకు జనసేనకు మద్దతుగా నిలిచిన కాపు సామాజిక వర్గం నేడు వైసీపీలో చేరుతోందని చెప్పారు. హరిరామ జోగయ్య కుమారుడు నిన్న వైసీపీలో చేరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులు ఇప్పుడు జగన్ మరోసారి సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.