ధారవిలో పెరుగుతున్న కరోనా కేసులు

ఏడు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం!

mumbai dharavi
mumbai dharavi

ముంబయి: ముంబయిలోని ధారవిని కరోనా చుట్టేస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ 22 కరోనా పాజిటివ్‌ కేసలు నమోదు అయ్యాయి. దీంతో ఇక్కడ నివసిస్తున్న వారికి కరోనా పరీక్షలను నిర్వహించాలని ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధకారులు నిర్ణయించారు. ఈ ప్రాంతం నుండి 50 మంది తబ్లీగీ జమాత్‌ కు వెళ్లివచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతొ కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో సుమారు ఏడు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ముంబయి అగ్నిమాపక సిబ్బంది సహయంతో ధారవి ప్రాంతాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/