అనంత్ మాటలకు ముఖేష్ కన్నీరు

గుజరాత్.. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి ముందు వేడుకలు (pre wedding celebration) వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకకు సినీ తారలు , బిజినెస్ ప్రముఖులు , క్రికెట్ స్టార్స్ ఇలా ఎంతో మంది హాజరై సందడి చేస్తున్నారు. ఈ వేడుకలో అనంత్ మాటలకు తండ్రి ముఖేష్ కన్నీరు పెట్టుకున్నారు. ‘నా పెళ్లి వేడుకలను గ్రాండ్‌గా జరిపేందుకు నా ఫ్యామిలీ ఎంతో కష్టపడుతోంది. నా సంతోషం కోసం మా అమ్మ ఎంతో చేసింది. రోజుకు 18 నుంచి 19 గంటల వరకు కష్టపడింది.

నా పెళ్లి వేడుకలను ప్రత్యేకింగా చేసేందుకు కొన్ని నెలలుగా నా కుటంబమంతా నిద్రలేకుండా కష్టపడుతూనే ఉంది. అందరికి తెలిసిన విషయమే.. నా జీవితం ఏమి పూలపాన్పు కాదు.. చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎన్నో కఠిన సవాళ్లను దాటాల్సి వచ్చింది. ఇలాంటి కష్టసమయాల్లో నా అమ్మానాన్న నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నాకు బాధ తెలియకుండా చూసుకున్నారు. నాకు ఏమి కావాలో అన్ని చేశారు. నా పెళ్లి వేడుక ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే అందుకు మా అమ్మే కారణం. అమ్మ వల్లే ఇదంతా సాధ్యమైంది. అమ్మకు నేను జీవితాంతం రుణపడి ఉంటా..’ అంటూ అనంత్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇదంతా విన్న ముఖేష్ అంబానీ సైతం బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎంత కుబేరులైన ముఖేష్ అంబానీ ఒక బిడ్డకు తండ్రే కదా.. కొడుకు విషయంలో తల్లిదండ్రులుగా అందించిన సపోర్టు అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.