అమరావతిలో మరో 10 మంది రైతుల అరెస్ట్‌

arrested
arrested

అమరావతి: రాజధాని రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి ప్రాంతానికి చెందిన 10 మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై మాట్లాడదామని చిలకలూరిపేట పోలీసులు రైతులను పిలిపించారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన రైతుల్లో పది మందిని అరెస్ట్‌ చేశారు.అరెస్టైన వారిలో కారుమంచి ఫణీంద్ర, కారుమంచి అప్పయ్య, జొన్నలగడ్డ మనోజ్‌, బొర్రా వరప్రసాద్‌, లోక్య భూక్యానాయక్‌, నాయుడు వెంకటేశ్వరరావు, త్రిపురనేని శ్రీను, కారుమంచి పకీరయ్య, నాయుడు రామకృష్ణ, బోడేపూడి నాగరాజు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/