పెగాసస్‌ను కొనుగోలు చేయలేదు : లోకేష్

Lokesh responde sobre Pegasus
Didn’t buy Pegasus: Lokesh

Amaravati: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వం స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేయలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాము ఎప్పుడూ ఎలాంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని అన్నారు.

మమతాజీ నిజంగా అలా చెప్పిందో లేదో, ఎక్కడ, ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదని ఒకవేళ ఆమె అలా చెబితే కచ్చితంగా తప్పుడు సమాచారం అందించినట్లేనని అన్నారు.

ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ తన ప్రభుత్వానికి పెగాసస్ స్పైవేర్‌ను ఆఫర్ చేశారని, దానిని తిరస్కరించినట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆమె వెల్లడించిన సమయంలో చంద్రబాబు హయాంలో ఆంధ్ర ప్రభుత్వం కూడా పెగాసెస్ వాడింది అని పేర్కొన్నారు. కాగా, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పైవేర్ ఆఫర్ చేశారని, అయితే దానిని తాము తిరస్కరించినట్టు చంద్రబాబు కేబినెట్‌లో ఐటి శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ చెప్పారు.

నిజంగానే తమకు పెగాసస్ ఉంటే జగన్ మోహన్ రెడ్డి తన దురాగత చర్యలన్నింటికీ ఫ్రీ అయి ఉండేవారా ? అని ఆయన అన్నారు. 2021 ఆగస్టులో అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం నుంచి వచ్చిన ఆర్టీఐ సమాధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను ‘ఎప్పుడూ సేకరించలేదని’ స్పష్టం చేసినట్లు నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెర (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/