ఐదేళ్ల మీ పాలనలో దోపిడి, అరాచకాలకు అంతేలేదు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటనను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. నిప్పుల కుంపటి కాదు చంద్రబాబు. గత ఐదేళ్ల మీ టిడిపి పాలనలో దోపిడి, అరాచకాలకు అంతేలేకుండా పోయిందని, రావణ కాష్టంలా మండిచావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందుకే ప్రజలు టిడిపి పార్టీని తరిమికొట్టారని విమర్శించారు. ఇంకా అమరావతి చుట్టూ 4 గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ పగటి వేషగాడిలా మారిపోయావు. రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారిపోయావు చంద్రబాబు అని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/