హ్యాపి బర్త్‌డే లెజెండ్
విష్ చేస్తూ రణ్వీర్ సింగ్ ట్వీట్

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సోమవారం తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ క్రికెట్లో కపిల్ దేవ్ సాధించిన అనేక రికార్డులను అభిమానులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కపిల్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 సినిమాని రూపొందిస్తోన్నారు. ఈ సినిమాని హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రని బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక పదుకొణె రణ్‌వీర్‌కి భార్యగా నటిస్తుంది. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు. 2020 ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రంని విడుదల చేయనున్నారు. అయితే ఈ రోజు కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా రణవీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/