జగన్ సర్కార్ కు భారీ షాక్

జగన్ సర్కార్ కు భారీ షాక్

జగన్ ప్రభుత్వానికి కోర్టుల నుండి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏపీ హైకోర్టు లోనే అనుకుంటే..ఇప్పుడు సుప్రీం కోర్ట్ లోను జగన్ సర్కార్ కు చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం ఏపీ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది. భారత దేశంలో ఇప్పటి వరకు మరో ప్రభుత్వానికి తగలని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక కేసులో షాక్ లు తప్పడం లేదు. ఒక్క బెయిల్ కొనసాగించే అంశంలో తప్ప.. దాదాపు ముఖ్యమైన అన్ని తీర్పుల్లో ప్రభుత్వానికి షాక్ లు తప్పలేదనే చెప్పాలి.