అమర్‌నాథ్ యాత్రలో ఏపీవాసి మృతి

అమర్‌నాథ్ యాత్రలో ఏపీవాసి మృతి చెందాడు. తాడేపల్లిగూడెంకు చెందిన తూనుగుంట్ల రఘునాధం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కాట్రాలో ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రఘునాధం ఈరోజు (శనివారం) ఉదయం మృతి చెందాడు.

రఘునాధం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు సహకరించాలని అధికారులను కుటుంబసభ్యులను కోరుతున్నారు. రఘునాధం తాడేపల్లిగూడెం నుంచి ఈనెల 4వ తేదీన 10 మంది బృందంతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. జమ్మూ ఆసుపత్రిలో రఘునాథం భౌతికకాయం వద్ద ఉన్న మణికంఠ అనే యువకుడు ఉన్నాడు.

రెండు రోజుల క్రితం ఈ యాత్ర లో మరో ఐదుగురు అనారోగ్యం తో కన్నుమూశారు. వీరు మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. ఈ యాత్ర మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 20 మంది వరకు చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి వాతావరణం పడకనే వీరు మరణించి ఉంటారని తెలిపారు.