దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,748

India – corona virus

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య నిలకడగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 6,298 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,916 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో 46,748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,39,47,756 మంది కోలుకోగా… 5,28,273 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,16,17,78,020 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,61,896 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా, క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/