అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్..భయాందోళనలో ప్రజలు

మరోసారి గ్యాస్ లీక్ ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు వద్ద గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్యాస్ లీకేజీపై ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు.

ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ లీక్‌పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.