తెరాస ప్లీనరీ సందర్భాంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు (ఏప్రిల్ 27) టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని HICC లో ప్లీనరీ సభ ఏర్పటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీ సందర్భాంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. HICC కొత్తగూడె-హైటెక్స్ తో పాటు సైబర్ టవర్స్-ఐకియ రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ టు కొత్తగూడ ప్రాంతం ఆఫీసుల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారి సూచన చేశారు.

రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని వివరించారు. నీరుష్ జంక్షన్ – సైబర్ టవర్స్ , జంక్షన్- మెటల్ చార్మినార్ జంక్షన్- గూగుల్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ రోడ్డు లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. మెటల్ చార్మినార్ జంక్షన్- కానా మేట జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.

ఇక ప్లినరీ సభ ఉదయం పది గంటలకు మొదలవుతుంది. రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3 వేల మందికి ఆహ్వానం పంపారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు గులాబీ రంగు చీరల్లో హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10-11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. స్వాగతోపన్యాసం, సీఎం కేసీఆర్ స్పీచ్‌ ఉంటాయి.