అమెరికాలో కొత్తగా 94 వేల పాజిటివ్ కేసులు

అమెరికాలో కొత్తగా 94 వేల పాజిటివ్ కేసులు
corona virus america

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. 24 గంట‌ల్లో 94వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వ‌రుస‌గా రెండ‌వ రోజు కేసుల సంఖ్య‌లో రికార్డు న‌మోదు అయ్యింది. గురువారం రోజున కూడా సుమారు 91 వేల కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 90 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. మ‌రోవైపు అమెరికా ఎన్నిక‌ల పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. మంగ‌ళ‌వార‌మే దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సుమారు 21 రాష్ట్రాల్లో వైర‌స్ కేసులు విస్తృతంగా ప్ర‌బ‌లుతున్న‌ట్లు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని స్వింగ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల ర్యాలీల‌కు హాజ‌ర‌వుతున్న వారికి మాస్క్‌ల‌ను అందిస్తున్నారు. టెంప‌రేచ‌ర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/