సదా బ్రహ్మచారి హనుమ

ఆధ్యాత్మిక చింతన

Lord Hanuma
Lord Hanuma

అంజనీ పుత్రుడు వాయుతనయుడు ఆంజనేయుడు మారుతి పావని రామబంటుగా అనేక నామాలతో అర్చించబడే అతిబలవంతుడు వానుమంతుడు.

బాల ప్రాయంలోనే పండును కుని ఉదయించే సూర్యుడిని మింగాలని ఆకాశానికి కెగిరి మూతి కాల్చుకుని, ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతె గాయపడ్డ హనుమంతుడి రూపం మారి పోయింది.

తన చేష్టలతో మునిశాపానికి గురైన ఆంజనేయడు తన శక్తి తానే గ్రహించని అమాయకత్వంతో ఉన్నా, సమయంవచ్చినప్పుడు వజ్రశరీరుడై ఎంత సాహస వంతకార్యన్నైనా అవలీలగా ఎదుర్కొనగల సమర్థుడు.

ఈశ్వరుడొసగిన శౌర్యవంతుడు. శ్రీరాముడు అరణ్యవాసకాలంలో రావణుడు అపహరించిన సీతకోసం వెతుకుతూ కిష్కింద ప్రాంతంలో తిరుగాడేవేళ…

హనుమంతుడు ఆయన ను వీక్షించ ఆపై ఆయన దాసుడై సుగ్రీవాజ్ఞ మేరకు సీతజాడ వెతక డానికి సముద్రాన్నే దాటి లంకకు చేరిన ధీమంతుడు.

అక్కడ అశోక వనంలో శోకిస్తున్న సీతను గుర్తంచి ఆమెకు రాముడి అంకుళీ యకం అందించి తానెవరో తెలియచేస్తాడు.

ఆ తరువాత, లంకలో చేరిన ఆంజనేయరాక రావణాసురుడి ఆగ్రహానికి కారణమై ఆయన తోకకు నిప్పంటిం చమని చెప్పగా లంకాదహనంకావించి ఉద్యానవనం ద్వంసం చేసి,..

అనేక మందిని తుదముట్టించి సీతమ్మచూడా మణీని, రాముడికి తిరుగు ప్రయాణంలో శ్రీరాముడికి చూపించి, ఆమె జాడ గురించి చెప్పిన హనుమ సాహసం వర్ణనాతీతం.

రామరావణ భీకర రణంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడి కోసం సంజీవి పర్వతాన్ని సెకరించి తెచ్చి ఆయన జీవించ డానికి తోడ్పడిన రామ భక్తుడు, అభ యాంజనే యుడు, విశ్వాస పాత్రుడైన రామ మిత్రుడు.

అయోధ్య చేరిన సీతారా ములు కొలువైన సభలో, రాముడం దరికీ విలువైన కానుకలు సమర్పిస్తూ, భార్య జానకీదేవికి ఒక రత్నాల హారం ఇవ్వగా, ఆమె ఆంజనేయుడికి, అది బహుమతిగా ఇస్తుంది. కానీ పవనసుతుడికి సదా రామసేవే ప్రధానం.

అన్నిటిలో ఆయనేకనిపించాలి. అనుకుంటూ హారంలోని ముత్రాలు, రత్నాలు ఒక్కొక్కటి కొరికిరామ దర్శనం వాటిల్లో చూడాలని ఆశిస్తాడు.

ఈ దృశ్యం అక్కడున్నవారు భరించలేక వానరుడికి రత్నాల విలువ ఏం తెలుస్తుంది? అని హేళనగా విమర్శించే వేళ, విభీషణుడు కలుగజేసుకుని రత్నాని రాయిగా భావించి కొరికే నీశిల లాంటి గుండెలో రాముడనంటాడేమో చూపించు అని అనగా …

వెంటనే తనరెండు ఏతులతో గోళ్లతో తన హృద యాన్ని చీల్చి అందులో ఆశీనులైన సీతా రాములను అక్కడున్న వారందరికీ చూపించగా. వారు ఆశ్చర్య చికితులై, ఆయన భక్తి ప్రపత్తులను ప్రత్యక్ష్యంగా చూసి తరించారు.

Lord Hanuma with Rama

అస్కలిత బ్రహ్మచారిగా వినుతికెక్కి, రామకార్య నిర్వణలో ప్రధాన పాత్ర వహించి, సముద్రాన్ని లంఘించి సేతువుని నిర్మించిన వానరసైన్యంలో,…

అపార భక్తిని శక్తిని ప్రదర్శించిన మారుతి, రామా యణ పుణ్య చరిత్రలో ధైర్యానికి, శౌర్యానికి, ప్రతీకగా తలచుకున్న వెంటనే భక్తులకు అభయమిచ్చే వేల్పుగా…

అనన్యసేవకు ఆదర్శ మూర్తిగా, నిత్యపూజలందుకునే భక్తులకు భగవంతుడిగా, అండగా ఉంటూ దేవాలయాలలో కొలువై, ఆకుపూజలందుకుంటూ ఉంటాడు.

సాధారణంగా ప్రతీ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహాలు మూర్తులు ఉంటాయి. అనుక్షణం రామధ్యానమే ఆయన ధ్యాసగా ఉండే విశ్వా సపాత్రుడు.

కొండగట్టు కసాపూర్‌”» పొన్నూరు వంటి పుణ్యక్షేత్రాలలో నిలువెత్తుగా నిలిచి పూజలు, అభిషే కాలు అందుకునే…

హనుమ ప్రయాణాలలో ఎదురయ్యే కొండలపై నగరపాలకుడిగా రక్షించేలా, ప్రతిష్టించబడి, ప్రమాదాల నుండి కాపాడే కరుణామూర్తి,

హనుమాన్‌ చాలీసా, సుందరకాండ పారాయణా, పఠించే వారికి కొంగుబంగారం ఈ దేవుడే.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/