దేశంలో రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు

ఆందోళన కలిగిస్తున్న కరోనా

Corona Tests
Corona Tests

New Delhi: భారత్ లో రోజుకు లక్షల్లో క‌రోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 24 గంట‌ల్లో 19.20 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించగా 3.86 ల‌క్ష‌ల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 1.87కోట్లు దాటింది. 24 గంటల్లో 3,498 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,08,330 కు చేరింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/