సింగరేణిలో 9 మంది కార్మికులకు కరోనా పాజిటివ్

వరంగల్: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా కలకలం రేపింది. ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికుల్లో 14 మంది కరోనా పరీక్షలు చేసుకోగా… 9 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు, సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పని చేసే ఇద్దరు వర్కర్లకుతో పాటు మిగతా వారు ఏరియా హాస్పిటల్ క్వారంటైన్ లో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/