శ్రీవారిని దర్శించుకున్న హీరో టీం ..

శ్రీవారిని దర్శించుకున్న హీరో టీం ..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా క‌థానాయ‌కుడిగా పరిచయమ‌వుతున్న చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్‌. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం ప్రత్యేకంగా తిరుపతి వెళ్లిన చిత్ర బృందం స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య హీరో గల్లా అశోక్ హీరోయిన్ నిధి అగర్వాల్ లతో పాటు గుంటూరు ఎంపీ హీరో గల్లా అశోక్ ఫాదర్ గల్లా జయదేవ్ ఆయన సతీమణి మహేష్బాబు సోదరి గల్లా పద్మావతి కూడా చిత్ర బృందంతో కలిసి స్వామివారిని దర్శంచుకున్నారు. సంప్రదాయ స్వామి వారిని దర్శించుకున్న తరువాత గల్లా జయదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఇక రీసెంట్ గా రాజమౌళి ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.