జనగామలో బండి సంజయ్‌ కి సవాలు విసురుతూ పోస్టుర్లు

నేడు జనగామ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర

trs-flexis-against-bandi-sanjay-in-jangaon

హైదరాబాద్ః టిఆర్ఎస్, బిజెపి మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. జనగామలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాలు విసురుతూ టిఆర్ఎస్ శ్రేణులు వీటిని ఏర్పాటు చేశాయి. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను తీసుకొచ్చిన తర్వాతే జనగామలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీల్లో టిఆర్ఎస్ పేర్కొంది. ఈ ఫ్లెక్సీలను టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏర్పాటు చేశారు. మరోవైపు, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతూ బిజెపి ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే బిజెపి ఫ్లెక్సీలను కొందరు చించేయడంతో… అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/