సూపర్ మచ్చి ట్రైలర్ విడుదల

సూపర్ మచ్చి ట్రైలర్ విడుదల

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ నటిస్తోన్న తాజా చిత్రం సూపర్ మచ్చి. విజేత సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మెగా చిన్నల్లుడు.. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి మూవీ చేస్తున్నారు. ఇందులో రచిత రామ్ హీరోయిన్‏గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

‘చూడకుండా లవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది.. ఇందులో ఏదో తెలియని ఫీల్ ఉంది’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. రాజు సార్ ఐ లవ్ యూ అంటూ కళ్యాణ్ దేవ్ ప్రేమ కోసం హీరోయిన్ పరితపిస్తుండగా.. కొన్ని కారణాల వల్ల హీరో ఆమె ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె తన ప్రేమను వ్యక్తపరచడం ఆపలేదు. అదే సమయంలో హీరోలోని మరో కోణాన్ని చూపించారు. బయటకు రఫ్ గా కనిపిస్తూనే.. లోపల సెన్సిటివ్ గా ఉండే పాత్ర అని తెలుస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే..లవ్ అండ్ యాక్షన్ అంశాలు కలబోసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు అర్థం అవుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.