దేశంలో కొత్తగా 7,946 కరోనా కేసులు

క్రియాశీల కేసులు..62,748

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో రోజువారీ కరోనా కేసులు పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 7,946 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 37 మంది మరణించారు. ఒక్కరోజులో 9,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 12,90,443 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,12,52,83,259 కు చేరింది. ఒక్కరోజే 2,66,477మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 652,816 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,942 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,922,595కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,495,689మంది మరణించారు. శనివారం మరో 834,638 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,030,694కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/