వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

commercial-lpg-price-cut-down

న్యూఢిల్లీః వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను భారీగా తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ.1976.07గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1885కు తగ్గింది. ఇక ముంబైలో రూ.1844, కోల్‌కతాలో 1995.50, చెన్నైలో రూ.2045కు చేరాయి.

తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2099.5కు తగ్గింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. చివరగా జులై 6న రూ.50 పెరిగింది. అయితే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గడం జూన్‌ తర్వాత ఇది నాలుగోసారి. గ్యాస్‌ ధరలు భారీగా పెరడగంతో మే నెలలో రూ.2354 రికార్డు స్థాయికి చేరాయి. అయితే జూన్‌ 1 నుంచి వాణిజ్య సిలిండర్‌ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/