అమెరికాలో కరోనా విలయతాండవం

ఒక్కరోజులోనే 1,973 మంది మృతి

corona virus
corona virus

అమెరికా: అగ్రరాజ్యంలొ కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతుంది. కేవలం బుధవారం ఒక్కరోజులోనే కరోనా కారణంగా 1,973 మంది మరణించారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,695 కి చేరింది. కాగా ఇప్పటి వరకు అమెరికాలో నమోదయిన కోవిడ్‌ భాధితుల సంఖ్య 4,35,128 కి చేరింది ఒక్కరోజులోనే సుమారు ముఫ్పైవేల మందికి పైగా కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/