తిరుమల నడకమార్గంలో మరో చిరుత చిక్కింది

తిరుమల నడకమార్గంలో మరో చిరుత అటవీ అధికారులు అమర్చిన బోన్ లో పడింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో 2,850 మెట్టు వద్ద ఈ చిరుత పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన చిరుతల్లో ఇది ఆరో చిరుత. ఆగస్టు 11వ తేదీన లక్షిత పై దాడి చేసిన వ్యూ పాయింట్‌ పరిసరాల్లోనే ఈ చిరుత చిక్కడం తో లక్షిత ఫై దాడి చేసిన చిరుత ఇదేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిరుతను మరికాసేపట్లో ఎస్వీ జూ కు తరలించనున్నారు అధికారులు. కాగా, గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని గమనిస్తున్నారు అటవీశాఖ అధికారులు.

ఈ క్రమంలోనే బోను ఏర్పాటు చేయగా.. బుధువారం ఉదయం బోనులో చిక్కింది. మరోపక్క నడకమార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. ఎటునుండి ఏ చిరుత దాడి చేస్తుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులతో పాటు అటవీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరివేక్షిస్తున్నారు.