అక్టోబర్ 6వ తేదీ లోపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..?

తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలుకాబోతుందా..? అంటే అవుననే చెప్పాలి. అక్టోబర్ 06 లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనీ ఎన్నికల సంఘం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబదించిన కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. వాస్తవానికి 2018లో డిసెంబర్ 7న ఎన్నికల జరిగాయి. ఆ తరువాత జనవరి 16వ తేదీన శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీని ప్రకారం.. తదుపరి ఎన్నికలు అంటే 2024లో జనవరి 17 లోపే కొత్త శాసనసభ ఏర్పాటు కావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో భారత ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. ఈ బృందంలో రాష్ట్రలో ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ భద్రతా వంటి అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి తమ నివేదికను అందజేస్తుంది. ఆ నివేదిక ఆధాంగా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని అంటున్నారు.