మహిళా రిజర్వేషన్ బిల్లు ఫై కేటీఆర్ స్పందన

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం పట్ల భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ ఈ బిల్లు ఫై హర్షం వ్యక్తం చేసారు. కొన్ని విషయాలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై స్పందించారు. ఈ బిల్లు పట్ల ఓ భారతీయుడిగా తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే అంశానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్‌ చేశారు.

దేశంలో నేడు మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును చట్టంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో ఎప్పటినుంచో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేశామన్నారు కేటీఆర్. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు గ్రామ పంచాయతీలలో తాము సగం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నామని మహిళా రిజర్వేషన్ బిల్లుపై తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ స్పందించారు.