38 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ న‌మోదు:డ‌బ్ల్యూహెచ్‌వో

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు..డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా: ఇప్పటి వ‌ర‌కు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ న‌మోదు అయిన‌ట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అయితే ఆ వేరియంట్ ఆందోళ‌న‌క‌ర‌మే అయినా.. దాని వ‌ల్ల మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఒమిక్రాన్ సంబంధిత మ‌ర‌ణాలు న‌మోదు కాలేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. డ‌బ్ల్యూహెచ్‌వో టెక్నిక‌ల్ హెడ్ మారియా వాన్ ఖేర్‌కోవ్ కూడా ఒమిక్రాన్‌పై రిపోర్ట్ ఇచ్చారు. 38 దేశాల్లో న‌మోదు అయిన ఒమిక్రాన్ కేసులు.. ఇప్పుడు త‌మ శాఖ‌లు ఉన్న ఆరు ప్రాంతాల్లోనూ వ్యాప్తి చెందిన‌ట్లు మారియా తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/