దేశంలో కొత్తగా 6,822 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నది. కొత్తగా 10,004 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో 3,40,79,612 మంది కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,73,757 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 128.76కోట్ల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/