హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్ కేసు

ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారించిన కేంద్ర వైద్యఆరోగ్యశాఖ

coronavirus -covid 19
coronavirus -covid 19

హైదరాబాద్‌: చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) తాజాగా తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ నిర్ధారించింది. అతడు దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/