వర్మ మామూలుడు కాదు..బన్నీ – పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదొక వివాదం సృష్టిస్తూ ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రశాంతంగా ఉన్నఅభిమానుల్లో ఆగ్రహపు జ్వాలలు సృష్టించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఫై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉండే ఈయన..తాజాగా అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చిచ్చు పెట్టాడు. గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ అభిమానులకు , బన్నీ అభిమానులకు మధ్య కాస్త దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి దూరాన్ని మరింత పెంచే ట్వీట్ చేసాడు వర్మ.

అల్లు అర్జున ప్రస్తుతం నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి నింపారు. ట్రైలర్ లో అల్లు అర్జున్ యాస , యాక్షన్, గెటప్ ఇలా అన్నింటికీ అభిమానులు ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకుంటున్నారు. ఈ ట్రైలర్ ఫై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తుండగా..వర్మ కూడా స్పందించారు.

రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సుపర్ స్టార్ అల్లు అర్జున్ అని వర్మ కితాబునిచ్చారు. ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నించారు. ‘పుష్ప’ అంటే పుష్పం కాదని… అది ఫైర్ అని అన్నారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు , బన్నీ అభిమానుల మధ్య గొడవ పెట్టాలని వర్మ చూస్తున్నాడని అంత భావిస్తున్నారు.

. @alluarjun is the only SUPER STAR who is unafraid of just playing a REALISTIC character and I dare @PawanKalyan @urstrulyMahesh @KChiruTweets @rajinikanth and all other extras to do it ..PUSHPA is not FLOWER ..it’s FIRE https://t.co/bLIdlsG89Y— Ram Gopal Varma (@RGVzoomin) December 6, 2021