రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధిస్తాం – బండి సంజయ్

bandi-sanjay

రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేసారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ప్రభావితం చేసేందుకు పక్కా వ్యూహం చేపడుతుంది. ఇందులో భాగంగానే ప్రజా సంగ్రామ యాత్ర.. ఇప్పుడు జన సంపర్క్ యాత్ర వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లో నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్..బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రధాన విలన్లయిన రావుగోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, అల్లురామలింగయ్య పాత్రల్ని పార్టీలు పోషిస్తున్నారని విమర్శించారు. రావుగోపాల్ రావు పాత్రను బీఆర్ఎస్ పోషిస్తుంటే.. అల్లు రామలింగయ్య పాత్రను కాంగ్రెస్, మిగతా పార్టీలు కైకాల సత్యానారాయణ పాత్ర పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం యుద్ధం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు.

మోడీ నేతృత్వంలో ఎన్నో పథకాలు వచ్చాయని , కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర నిధులను సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు. గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని, సింగిల్ గా పోటీ చేస్తుందని.. మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.