ప్రమాదానికి గురైన అయ్యప్ప యాత్రికుల బస్సు

కేరళలోని పతనంథిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో సుమారు 62మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరంతా తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారి పడింది.

నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్‌ వద్ద ఈ ఘటన జరగింది. ప్రమాదం సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.