మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి

మెక్సికోలోని ఓ వలసదారుల కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 39 మంది మృతి చెందగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సిన్‌ నగరంలోని నేషనల్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్‌(INM) సిబ్బంది అగ్నిప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ఐఎన్‌ఎం శిబిరంలోని పార్కింగ్ స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలను దుప్పట్లలో కప్పి ఉంచినట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో 29 మందికి గాయాలైనట్లు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద సమయంలో ఈ శిబిరంలో 70 మంది శరణార్థులు ఉన్నట్లు, వారిలో అధికులు వెనిజువెలాకు చెందిన వారని తెలుస్తోంది. ఈ శిబిరం స్టాంటన్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌కు దగ్గర్లో ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించేందుకు సియుడాడ్ జువారెజ్ ముఖ్యమైన ప్రాంతం. అగ్రరాజ్యం ఆశ్రయం కోరిన అనేక మంది.. అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడి వలసదారుల కేంద్రంలోనే ఉంటారు. ఈరోజు రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.